అనువాదములు:ArabicBulgarianCebuanoChineseDeutschEnglishEspañolEweFarsiFilipinoFrançaisGalegoGreekGujaratiHindiItaliaSwahiliMalayPortuguêsPunjabiRussianSomaliTiếng ViệtUrduఇతర మాధ్యములు:టెక్సటపవర పాయింటుమిగితా పాజీలువిభాగాలుస్థల పటములుముఖ్యమైన పదాలుసంప్రదించ వలసిన చిరునామాఅవసరమైన పత్రాలుఅవసరమైన అనుసందానములు |
మూలసిద్దాంతములను తెలుసు కొనండినైపుణ్యము వెనుక వున్న మూల సిద్దాంతములు, కారణములుబై ఫిల్ భర్ట్లె, పిహెచడిఅనువాదము సరస్వతిశిక్షణ పాంప్లెటఉత్తేజ పరిచే నాయకుడు అర్ధము చేసుకొనవలసిన మూలసూత్రములు, సిద్దాంతములుఇవి అంటే ఏమిటి అభివృద్ధి? సమాజభివృద్ధి? సమాజము ఫాల్గొనుట? పేదరికము? సమాజము? శక్తివంతము చేయుట? స్పష్టత?సంరక్షణ? ఈ పదముల అర్థములు "మూల పదములు" పట్టీలో వివరించబడినవి. ఉత్తేజ పరిచే నాయకుడిగా వెలుగొందాలి అంటే మీకు బహిరంగముగా ప్రసంగిచటము, కార్యసన్నాహానికి సమూహములు ఏర్పాటు చేయటము మించిన నైపుణ్యము కావాలి. మీరు ఆ నైపుణ్యమును ఎందులకు వాడవలెనో తెలుసుకొనవలయను. మీరు మూల సూత్రములను తెలుసుకొనవలయను. మీ లక్ష్యము సమాజమైన, మీకు ఆ సమాజము యెక్క సాంఘిక స్వభావము మరియు సాంఘిక మార్పుల(అభివృద్ధి కూడ) గురించి తెలియాలి. దీని అర్థము ఏమిటి అంటే మీకు కొద్దిగా సాంఘిక వ్యవస్థాపన గురించి, సమాజ శాస్ర్తము, మానవ శాస్ర్తము, ఆర్ధిక శాస్ర్తము, రాజకీయాల విషయాల పరిజ్ఞానము మరియు ఆ విషయాలకు సంభందించిన శక్తులు, పద్ధతులు యెక్క అవగాహన కొంతైన వుండాలి. ("సంస్కృతి" ని చూడండి) ప్రస్తుతము యూనివరసిటి డిగ్రి అవసరము లేదు, కాని మీకై మీరు ఆ విషయముల జ్ఞానమును, మూల సూత్రములను నేర్చుకోవాలి. ఒక వేళ మీరు తక్కవ ఆదయము గల సమాజమును బలపరచాలంటే (శక్తివంతము)మీరు దాని యెక్క శత్రువును, అంటే ఆదారపడే జబ్బును అర్ధము చేసుకొనవలయును.(" ఆదారపడటము" చూడండి"). మీ లక్ష్యము గనుక పేదరికమును నిర్మూలించటము అయితే మీరు పేదరికము యెక్క లక్షణములు, దుష్ఫలితములను మించి తెలుసుకొనవలయను. పేదరికానికి కారణముల విరుగుడు మార్పులను సంరక్షించుట కొరకు మీరు పేదరికానికి కారణాలను అర్ధము ఛేసుకోవాలి. పేదరిక ఉపశమనము వలన బాధ తాత్కలికముగా తగ్గును, కాని పేదరికము పూర్తిగా నిర్మూలింపపడదు. పేదరికానికి కారణము ఒక్క ధనము మాత్రమే కాదు, పైగా ధనము ఒక్కట్టే పేదరికాన్ని నిర్మూలించదు. ("పేదరికమును తగ్గించటానికి మూలసూత్రములు" చూడండి). మీరు "మూల పదములు", లో చూచిన, మీకు "సమాజ సేవకుడు" విషయము పైన ఒక మదిరిగా సంపూర్ణ జాబితా లభించును. ఒక్కొక్క దానికి మీకు నిఘంటువు నిర్వచనము దొరకదు; కాని మీకు "ఉత్తేజ పరిచే నాయకుడు ఎలా అవ్వాలి" అనే విషయానికి సంబంధించిన కొద్ది నోట్సు లభించును. తరవాత అంశము "సమాజమును శక్తివంతము చేయుటకు మూలసూత్రములు", మీకు వివరముగా ఈ సైటులో లభించే మూలసూత్రముల వెనుక వున్న పద్ధతులు, నైపుణ్యములను వివరించును. ఆ నోట్సు కంఠత పట్టనక్కరలేదు. ఒక్కొక్క సిద్దాంతము గురించి ఆలోచించండి. దాని గురించి మీ దినచర్య పుస్తకములో వ్రాయండి. మీ తోటి వారితో సమావేశములలో, సభలలో, కార్ఖానాలలో చర్చించండి. మీ తీరిక సమయములో పని తరువాత, మీ స్నేహితులతో ఫుటబాల స్కోరుల చర్చ సమయము నుండి కొద్ది సమయము ఒకటి రెండు ఈ విషయములను చర్చించటానికి వాడండి. ఒకేసారి అంతా "నేర్చుకోవటానికి చేసే ప్రయత్నము" ఒకేసారి అంతా "తినటానికి చేసే ప్రయత్నము" లాంటిది. సమాజము యెక్క అభివృద్ది గురించి నేర్చుకొనుట ఎప్పట్టికి ఆగకూడదు. నేర్చుకొనుట ఆపినచో మీరు మరణించినట్లు లెక్క. ––»«––© గ్రంధప్రచురణహక్కు 1967, 1987, 2007: ఫిల్ భర్ట్లె
––»«–– |
హోమ పేజి |
కార్య సన్నాహము |